- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన తీరు బాధాకరం: ఎంపీ లావు
దిశ, అమరావతి బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా గెలిచి, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఎం సాధించారో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆత్మపరిశీలన చేసుకోవాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హితవు పలికారు. శుక్రవారం నరసాపురం ఎంపీపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్, నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ…
పార్టీ అధిష్టానంతో ఇబ్బందులు తెచ్చుకోవడంతో పాటు, అటు ఎమ్మెల్యేలను, నమ్మకంతో ఎంపీగా గెలిపించుకున్న ప్రజలను ఇబ్బందిపెడుతున్న తీరు భాదాకరంగా ఉందన్నారు. పార్టీలోని నాయకులే అనర్హత వేటు వేయాలని కోరే స్థాయికి రావటం ఎంత భాదాకర విషయమో ఆలోచించుకోవాలన్నారు. గతంలో పార్టీలు మారిన వారి పరిస్థితి ఏమైందో ఒక్కసారి గమనించుకోవాలన్నారు. ఏదైనా కష్టం ఉంటే పార్టీలో ఉండే పరిష్కరించుకోవాలని, లేకపోతే రాజీనామా చేసి తనకు నచ్చిన పార్టీలో చేరవచ్చని సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించటం సబబు కాదన్నారు. ప్రజలతోటే తేల్చుకుంటాం అంటూ రాజు వ్యాఖ్యలు చేస్తున్నారని, అందుకు వైసీపీ కూడా సిద్ధంగా ఉందని శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.