రిపబ్లిక్ మూవీపై నారా లోకేశ్ ట్వీట్

by srinivas |
Nara
X

దిశ, ఏపీ బ్యూరో: హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. అయితే ఈ మూవీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్వీట్‌ చేశారు. సినిమా గురించి మంచి రివ్యూలు వింటున్నామని, త్వరలోనే సినిమా చూస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు. ఇకపోతే రిపబ్లిక్ మూవీ రాజకీయ కథాంశంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై నారా లోకేశ్ ప్రత్యేకంగా ట్వీట్ చేయడం రాజకీయ వర్గాలు, మెగా ఫ్యాన్స్‌లో చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed