‘అమరావతిని శ్మశానం చేస్తున్నారు’

by Anukaran |   ( Updated:2020-08-13 04:53:14.0  )
‘అమరావతిని శ్మశానం చేస్తున్నారు’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ యువనేత నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజధాని తరలింపు అంశంపై ఉద్యమం చేస్తున్న మహిళా రైతులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ.. ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘అమరావతిని శ్మశానం అంటూ రాక్షస ఆనందం పొందారు వైకాపా నాయకులు. ఇప్పుడు అమరాతిని నిజంగానే శ్మశానం చెయ్యాలని కంకణం కట్టుకున్నారు’సీఎం జగన్ అంటూ ఆరోపించారు.

రాజధానికి 95 సెంట్లు భూమి ఇచ్చి 240 రోజుల నుంచి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతు నాగేంద్రమ్మ మృతి చెందటం బాధాకరమని నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. మూడు ముక్కలాటతో 82 మంది రైతుల్ని బలిగొన్నారని.. ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి జగన్ మానవత్వంతో ఆలోచించాలని లోకేశ్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story