- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ పాలనలో ఫ్యాక్షన్ వికేంద్రీకరణ: లోకేశ్
నిన్న విశాఖపట్టణంలో చోటుచేసుకున్న సంఘటనలపై టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన లోకేశ్… ‘చంద్రబాబు గారి హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది. జగన్ గారి హయాంలో ఫ్యాక్షన్ వికేంద్రీకరణ జరుగుతుంది. నిన్న విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైకాపా పెయిడ్ ఆర్టిస్టులు, ఇతర జిల్లాల నుండి తరలించిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఉత్తరాంధ్రకి ఫ్యాక్షన్ రాజకీయాలను పరిచయం చేశారు’ అంటూ ట్వీట్ చేశారు.
దానికి కొనసాగింపుగా రెండో ట్వీట్‌లో ‘ప్రతిపక్ష నాయకుడి ప్రజా చైతన్య యాత్రకి అనుమతులు ఇచ్చి అరెస్ట్ చేశారంటేనే పొలీసు వ్యవస్థని ఎంత నిష్పక్షపాతంగా నడిపిస్తున్నారో అర్థం అవుతుంది’ అంటూ పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు చంద్రబాబునాయుడుతో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుకి సంబంధించిన వీడియోలను ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.