బుర్ర తక్కువ సలహాదారులు : నారా లోకేశ్

by srinivas |
Lokesh
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతం సవాంగ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ప‌ట్టాభి, నాదెండ్ల బ్రహ్మంలను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ విమర్శించారు. ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోతే 70 ల‌క్షల మంది టీడీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భవన్, పట్టాభి ఇంటిపై దాడి చేస్తే ఒక్కరినైనా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. బుర్ర తక్కువ సలహాదారుల బుర్రతో కాకుండా ఐపీఎస్ బుర్రతో ఆలోచిస్తే మీరు చేస్తోంది ఎంతవరకు సబబు అనేది మీకే తెలుస్తుందని హితవు పలికారు.

నాదెండ్ల బ్రహ్మంను బుధవారం నుంచి పలు పోలీస్‌ స్టేష‌న్ల చుట్టూ తిప్పి ఏదో చేయాల‌నే అనుకున్నారు, కానీ మీ ప్లాన్ బెడిసికొట్టడంతో ఇప్పుడు మరో కొత్త డ్రామాకు తెరలేపారని ధ్వజమెత్తారు. బ్రహ్మం మీద ఈగ వాలినా డీజీపీదే బాధ్యత అని హెచ్చరించారు. శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి చిత్ర హింసలకు గురి చేస్తున్నారంటూ డీజీపీపై ఫైర్ అయ్యారు. చట్టం పరిధి దాటి మరీ డీజీపీ అక్రమ అరెస్టులు చేస్తున్నారని.. త్వరలోనే న్యాయస్థానాల ముందు దోషిగా నిలబడేందుకు డీజీపీ గౌతం సవాంగ్ సిద్ధంగా ఉండాలన్నారు.

Advertisement

Next Story