‘మూర్ఖపు ముఖ్యమంత్రి గారు.. ఇప్పటికైనా సమీక్షలు చేయండి’

by srinivas |
CM Jagan Lokesh
X

దిశ, వెబ్‌డెస్క్ : మూర్ఖపు ముఖ్యమంత్రి గారు.. ఇప్పటికైనా కుతంత్రాలు మాని.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సమీక్షలు చేయండి అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సీఎం వైఎస్ జగన్ కు హితవు పలికారు. కరోనా పేషెంట్లకు కనీస వైద్యసేవలు అందడం లేదని , ఆస్పత్రుల్లోని దయనీయ దృశ్యాలు చూసైనా మానవత్వంతో స్పందించండి ముఖ్యమంత్రి గారు అని ట్వీట్ చేస్తే ఫేక్ న్యూస్ అని కేసులు పెట్టించాడని లోకేశ్ మండిపడ్డారు.

”కాకినాడ రమణయ్యపేట ప్రాంతానికి చెందిన వలంటీర్ లక్ష్మి ఏడు నెలల గర్భిణి.. ఆమెకు కొవిడ్ సోకి కాకినాడ ప్రభుత్వ ఆసత్ప్రిలో చేరారు. తనకు వైద్యం అందడంలేదని సెల్ఫీ వీడియోలో వేడుకున్నారు. కలెక్టర్ ఆదేశించినా వైద్యం అందక ఆమెతో పాటు కడుపులో బిడ్డ కూడా కన్నుమూసింది. వలంటీర్‌తో పాటు ఆమె కడుపులో ఉన్న పసిగుడ్డు మరణానికి మీ చేతకాని పాలన కారణం కాదా? జగన్‌రెడ్డి గారూ! ఇప్పటికైనా తాడేపల్లి కొంపలో కూర్చుని ప్రతిపక్షంపై ఎలా తప్పుడు కేసులు పెట్టాలనే కుతంత్రాలు మానేసి, ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలనే దానిపై సమీక్షలు చేయండి మూర్ఖపు ముఖ్యమంత్రి గారూ!” అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో పరిస్థితులు చక్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story