జగన్‌రెడ్డికి దేవుడంటే లెక్కలేదు :లోకేష్

by srinivas |
జగన్‌రెడ్డికి దేవుడంటే లెక్కలేదు :లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగరవేయడం అపచారం, అరిష్టం. సీఎం జగన్‌కు దేవుడంటే లెక్కలేదు.. ప్రజలంటే గౌరవం లేదని మండిపడ్డారు. వైసీపీ నేతల అహంకారానికి హద్దేలేదన్నారు. భక్తులపై లాఠీ ఛార్జ్ చేయించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలకు రద్దు చేసుకోకపోతే ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురికాక తప్పదని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story