- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాపై ప్రభుత్వం నిర్లక్ష్యం: లోకేష్
by srinivas |
X
దిశ, అమరావతి: కరోనా కల్లోలం సృష్టిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. కరోనాపై యుద్ధంలో ముందుడి పోరాడుతున్న వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సోమవారం లోకేశ్ ట్వీట్ చేశారు. సంక్షోభ సమయంలో ముందుండి పోరాడుతున్న ఆసుపత్రి సిబ్బంది, ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చారని వాపోయారు. గతంలో మాస్క్ అడిగినందుకు మూర్ఖంగా వ్యవహరించి, డాక్టర్‌పై పిచ్చివాడనే ముద్ర వేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం మరోసారి భేషజాలకు పోకుండా, విశాఖపట్నం ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో సిబ్బంది ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించాలన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కే భరోసా లేకపోతే, ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే ప్రమాదం ఉంటుందని లోకేశ్ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story