- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇజ్రాయెల్ నూతన ప్రధాని నఫ్తాలి బెన్నెట్.. పదవీకాలం సెప్టెంబర్ వరకే
దిశ,వెబ్‌డెస్క్ : యామినా పార్టీ అధ్యక్షుడు నఫ్తాలీ బెన్నెట్ (49) ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన 2023 సెప్టెంబర్ వరకు ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగనున్నారు. ఆదివారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బెన్నెట్ ఎనిమిది పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈయన కేబినెట్‌లో 29 మంది సభ్యులు ఉండగా అందులో 9 మంది మహిళలే ఉండటం గమనార్హం. అయితే గత రెండేళ్లగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌కు నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినంత మెజారిటీ రాలేదు. దీంతో అతి పెద్ద పార్టీ అయిన లికుడ్ పార్టీనీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు ఆదేశించాడు. కానీ లికుడ్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినంత మెజారిటీ బలం లేకపోవడంతో బల నిరూపణలో ఓడిపోయారు. దీంతో ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న యెష్ అటిడ్ ను ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాల్సిందిగా కోరాడు. దీంతో ఆ పార్టీ అధినేత లాపిడ్, యామినా పార్టీ అధినేత నఫ్తాలీ బెన్నెట్ తో మంతనాలు జరిపారు. దీంతో మెదటిసారిగా బెన్నెట్ సెప్టెంబర్ వరకు ప్రధాని బాధ్యతలు చేపట్టనుండగా తర్వాత రెండు ఏళ్లు లాపిడ్ ప్రధాని పదవిలో కొనసాగనున్నారు.