- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘PM మోడీకి కృతజ్ఞతలు చెప్పే సభ ఇది’.. మంత్రి నాదేండ్ల కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: విశాఖలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో ప్రధాని మోడీకి(PM Narendra Modi) అపూర్వ స్వాగతం పలికేందుకు కూటమి ప్రభుత్వం(AP Government) సంసిద్ధంగా ఉంది. అయితే ప్రధాని సభ ఏర్పాట్లను నేడు మంత్రి నాదేండ్ల మనోహర్(Minister Nadendla Manohar) పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పే సభ ఇది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు జనసైనికులు, ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. రోడ్ షోను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
ఉత్తరాంధ్రలో భారీ పెట్టుబడులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు. దీంతో ఉత్తరాంధ్రలో వలసలు నిలిచిపోనున్నాయి. ప్రధాని మోడీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రజలు ప్రధాని పర్యటన, సభ, రోడ్ షో ను విజయవంతం చేసేందుకు జనసైనికులు, వీర మహిళలు, శాసనసభ్యులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రధానికి స్వాగతం పలకడం బాధ్యతగా భావించి, కృతజ్ఞతలు తెలిపే విధంగా సభను విజయవంతం చేయాలని మంత్రి నాదెండ్ల పిలుపునిచ్చారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో ప్రధాని సభ ఏర్పాట్లపై మంత్రి నాదెండ్ల చర్చించి, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.