Formula E-Car Race Case: ఉన్నతాధికారులతో CM రేవంత్ కీలక సమావేశం

by Gantepaka Srikanth |
Formula E-Car Race Case: ఉన్నతాధికారులతో CM రేవంత్ కీలక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-కారు రేసు కేసు(Formula E-Car Race Case) పరిస్థితుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సమావేశం నిర్వహించారు. HMDA ఉన్నతాధికారులతో మంగళవారం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మున్సిపల్ శాఖ నుంచే నిధుల బదలాయింపు జరిగిన నేపథ్యంలో మున్సిపల్ శాఖ అధికారులతో రేవంత్ నిర్వహించిన భేటీ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో కేటీఆర్‌ న్యాయవాది మోహిత్‌రావు పిటిషన్‌ వేశారు. అంతకుముందు ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేటీఆర్‌ (KTR) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story