- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా చేపట్టాలి : రాధిక గుప్తా
దిశ, మేడ్చల్ బ్యూరో: ఆపరేషన్ స్మైల్ ను పకడ్బందీగా చేపట్టాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల చివరి వరకు ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమాల అమలు పై వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ గుప్తా సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, కార్మిక, విద్యా, మహిళా, శిశు సంక్షేమం, వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
భిక్షాటన చేస్తున్న పిల్లలు, వీధి బాలలను గుర్తించాలన్నారు. తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. దివ్యాంగులను ఎవరైన కించపరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్ జెండర్ లకు పునరావాసం , ఐడి కార్డులను అందించే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రుల్లో బ్యాంకుల్లో వయోవృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. సఖి కేంద్రానికి వచ్చే మహిళలకు న్యాయ మైన సేవలు అందించాలన్నారు.
ఐసీడీఎస్ ద్వారా గర్బిణీలు, బాలింతలకు అందుతున్న పోషకాహారాన్ని తనిఖీ చేయాలని సీడీపీవోలను ఆదేశించారు.మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి పనిచేసే ప్రదేశాల్లో నివారణ కోసం ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీల ద్వారా వివరాలను సేకరించాలని కోరారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రామ్మోహన్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథస్వామి, బాల రక్ష భవన్ కో ఆర్డినేటర్ నాగమణి,జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎండి ఇంతియాజ్ రహీం తదితరులు పాల్గొన్నారు.