- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అందరికి వైద్యం.. అదే మోదీ లక్ష్యం
దిశ ,మద్దూర్ : మండలంలోని జాదవరావు పల్లి, రేణివట్లలో కేంద్రం ప్రభుత్వ నిధులతో నిర్మించిన పల్లె దావఖానా లను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఆస్పత్రిలో సౌకర్యలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యన్ని అందుబాటులోకి తేవాలని ఈ పల్లె దావఖానాలను తెచ్చిందన్నారు . డాక్టర్లు, ఇద్దరు ఏ ఎన్ ఎం లు, ఆశ వర్కర్ లు, ఇతర సిబ్బందిని నియమించి ప్రజలకు తక్షణమే వైద్యం అందించబోతున్నామని తెలిపారు. మొత్తం 259 గ్రామ పంచాయతీలలో 59 పల్లె దావఖానాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం ఇతర లోపాలు గుర్తించి మందులు ఇవ్వాలన్నారు. పల్లె దవాఖానాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వీటి ఏర్పాటు ఉద్దేశ్యం నెరవేరేలా ఇక్కడి అధికారులు పని చేయాలన్నారు. మండలంలోని రేణివట్లలో బీ జే పీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేశారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇంచార్జీ తిరుపతి రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ కుమార్, పీ ఏ సీ ఎస్ చేర్మెన్ నర్సింహులు,కాంగ్రెస్, బీ జే పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.