- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Toyota: ఫ్యూచర్ 'ఓవెన్ సిటీ'ని ప్రారంభించనున్న టయోటా.. మొదట 100 మంది తరలింపు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా జపాన్‌లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'ఓవెన్ సిటీ' పేరుతో 2021లోనే ప్రారంభమైన ఈ నగరంలో నివశించేందుకు 100 మంది నివాసితులను ఈ ఏడాదిలో తరలించనున్నట్టు ప్రకటించింది. మౌంట్ ఫుజీ నుంచి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ నగరం పూర్తి భవిష్యత్తు టెక్నాలజీతో పనిచేయనుంది. ఆటోమెటెడ్ డ్రైవింగ్, రోబోటిక్స్, ఏఐ టెక్నాలజీతో నడుస్తుంది. జపాన్‌కు చెందిన మేగజైన్ ది సన్ ప్రకారం, ఓవెన్ సిటీ ఒక ల్యాబ్ తరహాలో పనిచేయనుంది. ఈ నగరంలో టయోటా కంపెనీ తన పునరుత్పాదక, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు 'ఈ-ప్యాలెట్స్ ' ను పరీక్షించనుంది. అంతేకాకుండా నగరంలో అన్ని పనులూ రోబోటిక్స్ సాయంతో జరగనున్నాయి. వీటన్నిటినీ పరిశీలించేందుకు మానవుల తీరును అర్థం చేసుకునేందుకు కొందరికి నివాసం కల్పించనున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం 100 మందిని, ఆ తర్వాత దశలో 2,000 మందిని తరలించనున్నట్టు కంపెనీ ఛైర్మన్ అకియో టయోడా విలేకరుల సమావేశంలో చెప్పారు. వోవెన్ సిటీలో కొత్త టెక్నాలజీని పరీక్షించే, అభివృద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఈ నగరానికి అయ్యే ఖర్చు గురించి కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. గతంలో వచ్చిన నివేదికల ప్రకారం, దీనికి సుమారు రూ. 85 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు సమాచారం.