గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ : పెద్దపల్లి ఎమ్మెల్యే

by Aamani |
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ : పెద్దపల్లి ఎమ్మెల్యే
X

దిశ, సుల్తానాబాద్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు తెలిపారు . సుల్తానాబాద్ మండలం కనుకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రాములపల్లి, కనుకులలో రూర్బన్ పథకం కింద నిర్మించిన గోదాములను, సొసైటీ కార్యాలయం విస్తరణ భవనాన్ని మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలం కనుకుల గ్రామం నుండి తొగర్రాయి గ్రామం వరకు ఉన్న రోడ్డును త్వరలోనే డబుల్ రోడ్డుగా, మండలం గర్రెపల్లి గ్రామం నుండి కనుకుల, ఓదెల మండలం ఉప్పరపల్లి మీదుగా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు ఉన్న అనేక గ్రామాలను కలిపే రోడ్డును డబుల్ రోడ్డుగా చేస్తున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలో మొదటి దశలోనే సుల్తానాబాద్ మండలాన్ని ఎంచుకుని పనులను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ధాన్యం కొనుగోలు సెంటర్లను కేటాయించి ఆయా సంఘాలను ఆర్థికంగా బలోపేతానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమానికి కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా రూ. 2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, కటింగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టామని, త్వరలోనే రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు కోట వీణ , ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సీఈవో బొంగోని శంకర్, డిసి ఓ, సహకార సంఘం పాలకవర్గ, కేడీసీసీబీ డైరెక్టర్, సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సుద్దాల సింగిల్ విండో చైర్మన్ మహిపాల్ రెడ్డి, చిలుక సతీష్ , గాజుల రాజమల్లు, మీస సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story