1980-90 మధ్య తెలంగాణ ఎట్లుండె?

by Shyam |
1980-90 మధ్య తెలంగాణ ఎట్లుండె?
X

విరాట పర్వం… రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను 1980-90 మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా తీస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా వస్తున్న మూవీలో నటిస్తున్నందుకు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు వెర్సటైల్ యాక్ట్రెస్ నందితాదాస్.

విరాటపర్వం సెట్ నుంచి కొన్ని ఫొటోలు షేర్ చేశారు. డైరెక్టర్ వేణు ఊడుగుల, డీఓపీ డాని సంచెజ్ లోపేజ్‌తో ఉన్న పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నందితాదాస్… తెలుగు మాట్లాడడం కొంచెం ఒత్తిడిగా ఉంది తప్పితే, సెట్‌లో చాలా బాగుందన్నారు. దీనిపై స్పందించిన డైరెక్టర్ మీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది మేడమ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాను ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే సీనియర్ హీరోయిన్ టబు సైతం విరాట పర్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా సినిమాలో రానా నక్సలైట్‌గా కనిపిస్తుండగా, జానపద కళాకారిణిగా అలరించనుంది సాయిపల్లవి.

Advertisement

Next Story