నిజామాబాద్ కలెక్టర్‌కు… నాందేడ్ కలెక్టర్ లేఖ

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మహరాష్ర్టలోని గోదావరి, పూర్ణ నదుల నీటి విడుదల చేసిన నేపథ్యంలో వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నదని, దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాకాలం దృష్ట్యా మహారాష్ర్టలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి, పూర్ణ నదులు పొంగిపొర్లుతున్నాయని, మహారాష్ర్టలోని నాందేడ్ కలెక్టర్, నిజామాబాద్ కలెక్టర్‌కు లేఖ పంపారు.

దీంతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం బోధన్, కోటగిరి, రెంజల్, నవీపేట్ మండలాల తహసీల్దార్లను అప్రమత్తం చేసి, ఆర్డీవోలకు సమాచారం అందజేసింది. కాగా జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఇప్పటికే 83 టీఎమ్‌సీల నీరు ఉండటంతో, వరద ఉధృతికి మరింత పెరిగి భారీ వరదలు సంభవించే అవకాశం ఉందని, స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు.

Advertisement