ఏడాదికి రెండు సార్లు సీబీఎస్‌ఈ పరీక్షలకు కేంద్ర విద్యా శాఖ కసరత్తు

by S Gopi |
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్‌ఈ పరీక్షలకు కేంద్ర విద్యా శాఖ కసరత్తు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈని కేంద్ర విద్యా శాఖ కోరినట్టు సమాచారం. దీన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు అవసరమైన వ్యూహరచనను సిద్ధం చేయాలని మంత్రిత్వ శాఖ చెప్పింది. అయితే, ఈ పరీక్షల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టే యోచనను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల ప్రిన్సిపాళ్లతో వచ్చే నెలలో సంప్రదింపులు జరగనున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్‌ల షెడ్యూల్‌పై ఎటువంటి ప్రభావం పడకుండా రెండో సారి బోర్డు పరీక్షలు నిర్వహించడానికి అకడమిక్ కేలండర్ కోసం విధివిధానాలను రూపొందించే ప్రక్రియను సీబీఎస్ఈ అధికారులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సీబీఎస్ఈ పరీక్షల మార్పు ఉండాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదాఎన్‌సీఎఫ్) కమిటీ సూచించింది. ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ 11,12 తరగుల విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్ని కూడా ప్రతిపాదించింది. అలాగే, ఎన్‌సీఎఫ్ ప్రకారం, విద్యార్థులు మంచి పనితీరు కనబరచడానికి, ఉత్తమ స్కోర్‌ కోసం తగిన సమయం, అవకాశం ఉండేలా బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించబడతాయని గతేడాది విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Advertisement

Next Story