- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన నందమూరి లక్ష్మీపార్వతి
దిశ, ఏపీ బ్యూరో : తెలుగు అకాడమిని తెలుగు సంస్కృత అకాడమిగా ఏపీ ప్రభుత్వం మార్చడాన్ని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సమర్థించారు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటును తప్పుపట్టడం సరికాదన్నారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా విస్తరించటం వల్ల వచ్చిన నష్టం ఏమిటో వివరించాలన్నారు. నష్టం ఏమిటో చెప్పకుండా ఏదో ఘోరం జరిగిపోయినట్లు ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. తెలుగు భాషాభివృద్ధికి, దానితో పాటు సంస్కృత భాషాభివృద్ధికి కూడా జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజానికి అందరూ అభినందించాలన్నారు.
అకారణమైన, నిర్హేతుకమైన విమర్శలు చేయోద్దని లక్ష్మీపార్వతి విజ్ఞప్తి చేశారు. ఇకపోతే తెలుగు అకాడమి పేరు మార్పుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోపాటు జనసేన, బీజేపీలు తప్పుబడుతున్నాయి. తెలుగు అకాడమీ పేరు మార్పును తీవ్రంగా తప్పుబట్టాయి. పేరు మార్పు ద్వారా సాధించేదేంటి అని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. సంస్కృతంను అభివృద్ధి చేయాలంటే మరో అకాడమీ ఏర్పాటు చేయాలని.. కానీ తెలుగు అకాడమీని మార్చడం సరికాదని టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్, బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డిలు హితవు పలికారు.