మగధ సామ్రాజ్య రాజు "బింబిసార" గా నందమూరి హీరో..

by Shyam |   ( Updated:2023-10-10 15:50:32.0  )
మగధ సామ్రాజ్య రాజు బింబిసార గా నందమూరి హీరో..
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఎంత మంచివాడవురా’ చిత్రంతో పరాజయాన్ని చవిచూసిన నందమూరి కళ్యాణ్ రామ్ ఈసారి ఎలాగైన హిట్ ని అందుకోవాలని భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక మైథలాజికల్ సినిమాలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమాపై ఎటువంటి అప్ డేట్ రాలేదు. అయితే తాజాగా నేడు తన తాత నందమూరి తారకరామారావు 99వ జయంతి సందర్భంగా ఓ భారీ సినిమా అనౌన్సమెంట్ తో వచ్చాడు. ఇప్పటికే ‘NKR18’ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఆ చిత్రానికి ”బింబిసార” అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేస్తూ టైటిల్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వశిష్ట్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ లోయుద్ధం లో తన చేతిలో ఓడిపోయిన శత్రువుల శవాల గుట్టలపై కూర్చున్న కళ్యాణ్ రామ్ ‘కింగ్’ గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజైన బింబిసారుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఇందులో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరిన్ ట్రెసా – సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement

Next Story