- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడాలి నానికి నందమూరి వారసుని వార్నింగ్
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రి కొడాలి నానిపై నందమూరి వారసుడు చైతన్య కృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేష్‌ను టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్లు తిడితే సహించేది లేదని హెచ్చరించారు. లోకేష్ జోలికి వస్తే తాటతీస్తా మంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే బూతుల మంత్రి అని ముద్ర వేసుకున్న కొడాలి నాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఒక మంత్రి హోదాలో ఉండి నోటికి ఎంతొస్తే అంత వెధవ, సన్నాసి, దద్దమ్మ పప్పు అంటూ లోకేష్‌ను తిడతావా అంటూ మండిపడ్డారు.
లోకేష్‌ను వేస్ట్ ఫెలో అని ముద్ర వేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఐటీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా లోకేశ్ యువతకు ఉద్యోగాలు కల్పించారని అలాంటి వ్యక్తిని విమర్శించే అర్హత నానికి ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. టీడీపీపై కొడాలి నాని, వైసీపీ నేతలు దుర్భాషలాడటం మానుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షాలను విమర్శించే బదులు పాలనపై దృష్టి సారిస్తే మంచిదని వైసీపీ నేతలకు నందమూరి చైతన్య కృష్ణకు సూచించారు.