- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందిస్తాం : నందమూరి బాలకృష్ణ
దిశ, బంజారాహిల్స్: క్యాన్సర్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చికిత్స అందించడమే కాకుండా, ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ ప్రపంచస్థాయి క్యాన్సర్ వైద్యాన్ని అందించడంలో ముందుంటామని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మైన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో నిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన అత్యాధునిక ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ ఆక్సిజన్ ప్లాంట్లో 95 శాతం నాణ్యతతో కూడిన ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తారన్నారు. భవిష్యత్‌లో ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా చూసేందుకు ఈ కేంద్రం పని చేస్తుందన్నారు. నోవార్టిస్ అందించిన రూ.1.2 కోట్ల ఆర్థిక సహాయంతో దీన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సీఈవో డాక్టర్ ఆర్వీ ప్రభాకర్ రావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్.రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫణి కోటేశ్వర్రావు, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ వీరయ్య చౌదరి, రామాంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.