కాలమే సమాధానం చెప్తుంది : నమ్రత

by Shyam |
కాలమే సమాధానం చెప్తుంది : నమ్రత
X

బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా రాణించిన నమ్రతా శిరోద్కర్.. తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్ బాబు సరసన ‘వంశీ’, మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ‘అంజి’ చిత్రంలో నటించారు. వంశీ షూటింగ్ సమయంలోనే మహేశ్, నమ్రతల మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. చక్కగా లైఫ్ లీడ్ చేస్తూ గౌతమ్, సితారకు బెస్ట్ పేరెంట్స్ కూడా అనిపించుకుంటున్నారు. మహేశ్‌లో బెట్టర్ హాఫ్ అయిన నమ్రత.. మహేశ్ బాధ్యతలు పంచుకుంటూ హ్యాపీగా హౌస్‌వైఫ్‌గా సెటిల్ అయిపోయారు. అయితే అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ చిట్ చాట్‌లో పాల్గొన్న నమ్రత.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు.

టాలీవుడ్‌లో మీ ఫేవరేట్ హీరో?
ఇంకెవరూ.. మహేశ్ బాబు.

మహేశ్ సినిమా సెలక్షన్‌లో మీ పాత్ర?
తన వర్క్ విషయంలో తనదే ఫైనల్ జడ్జ్‌మెంట్. నేను మధ్యలో వెళ్లను.

మహేశ్ సినిమాల్లో మీ ఫేవరెట్?
ఒక్కడు, పోకిరి, మహర్షి, దూకుడు, సరిలేరు నీకెవ్వరు, భరత్ అను నేను

మీ ఇద్దరిలో ముందు ఎవరు ప్రపోజ్ చేశారు?
నిజంగా నాకు గుర్తులేదు.

మహేశ్ – పూరీ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా?
కాలమే సమాధానం చెప్పాలి

మీ లైఫ్‌లో బెస్ట్ మూమెంట్స్?
నాకు రెండు బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి
1. మహేశ్‌ను పెళ్లి చేసుకున్న రోజు
2. గౌతమ్, సితారలు పుట్టినరోజు

మీ ఇద్దరు పిల్లల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు?
ఇద్దరూ అల్లరి చేస్తారు

సితార సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందా?
అది ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం తన యూట్యూబ్ చానల్ ( ఆద్యసితార)కు వీడియోలు చేయడాన్ని ఎంజాయ్ చేస్తోంది

మీరు కుటుంబాన్ని, బిజినెస్ బాధ్యతలను ఎలా మేనేజ్ చేస్తున్నారు?
దీనినే మల్టీ టాస్కింగ్ అంటారు.

మీ బ్యూటీ సీక్రెట్?
టైమ్‌కు తినడం, పడుకోవడం, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయడం

ఫేవరెట్ క్రికెటర్?
మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ

మీరు మహారాష్ట్రను, అక్కడి కుటుంబాన్ని మిస్ అవుతున్నారా?
నేను మహారాష్ట్రకు చెందిన అమ్మాయిని అని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది. నా మరాఠీ ఫ్యామిలీని మిస్ అవుతున్నా.

ఇందిరమ్మ గురించి?
ప్రేమ యొక్క సారాంశం.

ఫేవరెట్ హాలీడే స్పాట్?
స్విస్ ఆల్ప్స్

మీ లైఫ్‌లో బెస్ట్ ఫేజ్?
తల్లి పాత్ర

మీ హాబీస్?
ఇంటీరియర్ డిజైనింగ్

లాక్‌డౌన్‌లో నేర్చుకున్నది?
సహనంతో ప్రేమగా ఉండటం.

Advertisement

Next Story