- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ నోటిఫికేషన్ నేడే
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందినవే. అయితే మంగళవారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. కాంగ్రెస్, బీజేపీకి సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దూరంగానే ఉన్నాయి. అయితే ఈ నెల 16 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ రోజు నామినేషన్లు వేస్తారనేది క్లారిటీ రాలేదు. అయితే ఖాళీ అయిన ఆరు స్థానాలకు శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎల్. రమణ, శ్రవణ్ రెడ్డిలకు ఎమ్మెల్సీగా దాదాపు పేర్లు ఖరారైనట్లు సమాచారం.
వీరితో పాటు సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ లేదా తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి లేదా ఎర్రోళ్ల శ్రీనివాస్, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా ఎంసీ కోటిరెడ్డికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుండటంతో త్వరలోనే అధికారికంగా పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాత్రం ఈ నెల 16 వరకు సమయం ఉన్నందున పేర్ల ప్రకటనలో తొందరేమీ లేదని, ప్రకటిస్తామని వెల్లడించారు.