చైనా మొదటి అంగారకుడి మిషన్ పేరు ఇదే!

by Harish |
చైనా మొదటి అంగారకుడి మిషన్ పేరు ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్:
చైనా వార్షిక అంతరిక్ష దినోత్సవం, వారి మొదటి శాటిలైట్ ప్రయోగించి 50 ఏళ్లు పూర్తవతున్న సందర్భంగా శుక్రవారం రోజున తమ మొదటి అంగారక మిషన్ పేరును చైనా ప్రకటించింది. దీనికి తియాన్‌వెన్-1 అని పేరు పెట్టినట్లు చైనా అంతరిక్ష సంస్థ ప్రకటించింది.

ఈ మిషన్‌ను ఈ ఏడాదిలో ప్రారంభించనున్నారు. తియాన్‌వెన్ అంటే స్వర్గానికి ప్రశ్నలు అని అర్థం. ఇదే పేరుతో క్యు యువాన్ అనే కవి పద్యాలు రాశారు. ఇది మాత్రమే కాకుండా భవిష్యత్తులో చేయబోయే చాలా అంతరిక్ష ప్రయోగాలు తియాన్‌వెన్ అనే పేరు పెడతామని, తద్వారా అంతరిక్ష పరిశోధనా రంగంలో తమ విజయాలకు గుర్తుగా ఉంటుందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) తెలిపింది.

Tags: China, Tianwen, Space, mars, mission, CNSA, satellite

Advertisement

Next Story