మనీ పంచుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నమస్తే తెలంగాణ రిపోర్టర్

by Anukaran |   ( Updated:2021-10-30 01:36:08.0  )

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు ఎన్నికల రూల్స్ బ్రేక్ చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాయంపేట గ్రామంలో నమస్తే తెలంగాణ రిపోర్టర్ డబ్బులు పంపిణీ చేస్తుండగా తాము పట్టుకున్నామని వారు తెలిపారు. ఫేక్ ఐడీ కార్డు సాయంతో ఈ పని చేస్తున్నాడన్నారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story