నల్లగొండ పోలీసుల ఓవరాక్షన్.. మీడియా ప్రతినిధులపై దాడి

by vinod kumar |
నల్లగొండ పోలీసుల ఓవరాక్షన్.. మీడియా ప్రతినిధులపై దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యవసర పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చిన మీడియా ప్రతినిధులపై నల్లగొండ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తారా? అంటూ వారిపై దాడులకు పాల్పడ్డారు. కనీసం సమాధానం చెప్పే టైమ్ కూడా ఇవ్వకుండా విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో పలువురు జర్నలిస్టులకు గాయాలు అయ్యాయి. దీంతో పోలీసుల వైఖరిని పలు రాజకీయ పార్టీలతో పాటు, స్వచ్ఛంద సంఘాలు కూడా ఖండించాయి. పోలీసులు అత్యుత్సానికి నిరసనగా నల్లగొండ విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే.. కొన్ని అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చి మిగతా కార్యకలాపాలను నిలిపివేసింది. అందులో స్పష్టంగా మీడియాకు అనుమతి తెలిపింది. దీంతో అత్యవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని వివరాలు తెలసుకోకుండా దాడులకు తెగబడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed