- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పల్లా’ను టెన్షన్ పెట్టిస్తున్న తీన్మార్ మల్లన్న..!
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఏడు రౌండ్లకు ఇప్పటివరకు ఐదు రౌండ్లు మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన సంగతి తెలిసిందే. ఐదు రౌండ్ల లెక్కింపు ముగిసేసరికి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్న మీద 18549 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. అయితే ప్రతి రౌండ్ లెక్కింపునకు నాలుగు గంటల కంటే అధికంగా సమయం పడుతోంది. దీంతో మిగిలిన రెండు రౌండ్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 5 గంటలు అయ్యే అవకాశం ఉంది. ఐదు రౌండ్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 79,113 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 60,564 ఓట్లు, కోదండరామ్ కు 49,200 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 28,991 ఓట్లు వచ్చాయి. మొత్తంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి 18,549 ఓట్ల ఆధిక్యంతో మొదటి స్థానంలో నిలిచారు.
మొదటి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు వచ్చిన ఓట్లు
మొదటి రౌండ్ : 16130
రెండో రౌండ్ : 15857
మూడో రౌండ్ :15558
నాలుగో రౌండ్ :15897
ఐదో రౌండ్:15671
ఐదు రౌండ్ల మొత్తం ఓట్లు 79113
రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న
మొదటి రౌండ్: 12,046
రెండో రౌండ్ :12070
మూడో రౌండ్ :11742
నాలుగో రౌండ్:12146
ఐదో రౌండ్:12560
ఐదు రౌండ్ల మొత్తం 60564 ఓట్లు
మూడో స్థానంలో టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం
మొదటి రౌండ్ : 9080
రెండో రౌండ్ : 9448
మూడో రౌండ్ :11039
నాలుగో రౌండ్: 10048
ఐదో రౌండ్:9585
ఐదు రౌండ్ల మొత్తం 49200
నాలుగో స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేంధర్ రెడ్డి
మొదటి రౌండ్ : 6615
రెండో రౌండ్ : 6669
మూడో రౌండ్ : 5320
నాలుగో రౌండ్ : 5099
ఐదో రౌండ్: 5288
ఐదు రౌండ్ ల మొత్తం: 28991
ఐదో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్
మొదటి రౌండ్ 4354
రెండో రౌండ్ 3244
మూడో రౌండ్ 4333
నాలుగో రౌండ్:4003
ఐదో రౌండ్:4340
ఐదు రౌండ్ల మొత్తం ఓట్లు 20274
కౌంటింగ్ పూర్తయిన ఐదు రౌండ్లలో 6,906 ఓట్లతో జయసారథిరెడ్డి ఆరో స్థానంలో, 6828 ఓట్లతో చెరుకు సుధాకర్ ఏడో స్థానంలో, 5764 ఓట్లతో రాణి రుద్రమరెడ్డి ఎనిమిదో స్థానంలో ఉన్నారు. మొత్తం ఈ ఎమ్మెల్సీ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న విషయం తెలిసిందే.