- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు… చర్యలు తీసుకుంటాం
దిశ ప్రతినిధి, నల్లగొండ: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్హించడానికి, మండపాల ఏర్పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. రెండు, మూడు రోజులుగా నిబంధనలు పాటిస్తూ, మండపాలు ఏర్పాటు చేసుకోవచ్చని సామాజిక మాధ్యమాలలో వస్తున్న అసత్య వార్తలను నమ్మి మండపాల నిర్వాహకులు ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కోవిడ్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా మండపాల ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందుకోసం కొన్ని నిబంధనలు పాటించాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వ్యక్తులపై ప్రభుత్వం జారీ చేసిన జీఓలకు అనుగుణంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సబ్ డివిజన్ పరిధిలో మండపాల ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా చిన్న చిన్న మట్టి విగ్రహాలను ఇండ్లలో ప్రతిష్టించుకొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మరింత బాధ్యతాయుతంగా ప్రజలంతా పోలీస్ శాఖతో సహకరించాలని ఆయన కోరారు.