నాగార్జునసాగర్‌ టీడీపీ అభ్యర్థి ఖారారు

by Shyam |
Nagarjunasagar TDP candidate Muvva Arun Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే కసరత్తులు మొదలెట్టాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవం చూసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికే పెద్ద దెబ్బ చవిచూసిన టీఆర్ఎస్ కూడా ఎలాగైనా గెలిచి తీరాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ నాగార్జునసాగర్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని తెలుగుదేశం పార్టీ చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానాన్ని దక్కించుకొని మళ్లీ తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ అభ్యర్థిగా మువ్వా అరుణ్ కుమార్‌ను ప్రకటించారు.

Advertisement

Next Story