ఆదర్శ, హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

by Shyam |
ఆదర్శ, హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
X

దిశ, నాగర్ కర్నూలు: ఆకుపచ్చని గ్రామాలుగా, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. పల్లె ప్రగతి పనుల పరిశీలనల కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగర్‌కర్నూల్ మండలంలోని మంతటి గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. అంనతరం పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాన్ని సంపూర్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వారికి పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ వచ్చే వారం నాటికి పూర్తి స్థాయిలో పరిశుభ్రత పాటించాలని కోరారు.

గ్రామాల్లోని ప్రజలకు అపరిశుభ్రత వాతావరణం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, దానిని నివారించాలని కలెక్టర్ కోరారు. స్వచ్చత మన జీవిన విధానంలో భాగం కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని వైరస్ వల్ల కాపాడుకోగలుగుతామని కలెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story