గాంధీపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

by srinivas |
గాంధీపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన నేత, ప్రముఖ నటుడు నాగబాబు పొత్తుధర్మాన్ని ప్రదర్శించారు. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతిపిత గాంధీని చంపిన నాధూరాంగాడ్సే జన్మదినాన్నిపురస్కరించుకుని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన ఏమన్నారంటే.. ‘ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. కానీ, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా దీనిపై మరో ట్వీట్‌లో…

‘గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తాను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అని ట్వీట్ చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా, నాగబాబు ట్వీట్ బీజేపీని తృప్తి పరిచి ఉంటుందని, ఆయన ఇలాగే ట్వీట్లు కొనసాగిస్తే.. జనసేన నేతకు కేంద్ర మంత్రివర్గంలో చోటిచ్చేలా ఉందని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed