మరో బాంబ్ పేల్చిన మెగా బ్రదర్ నాగబాబు.. అది ఇష్టంలేకనే ఆ పని చేశా అంటూ

by Shyam |
మరో బాంబ్ పేల్చిన మెగా బ్రదర్ నాగబాబు.. అది ఇష్టంలేకనే ఆ పని చేశా అంటూ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మా’ ఎలక్షన్స్ లో మొదటి నుంచి మెగా బ్రదర్ నాగబాబు చురుకుగానే పాల్గొన్నారు. ఈసారి ప్రకాశ్ రాజ్ కి మద్దతు ఇచ్చిన నాగబాబు ‘మా’ ఎన్నికలలో ప్రకాశ్ రాజ్ అపజయాన్ని పొందడంతో సంచలన నిర్ణయం తీసేసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరిని షాక్ కి గురిచేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. “ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా”ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం నాగబాబు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక నాగబాబు బాటలోనే ప్రకాశ్ రాజ్ సైతం సోమవారం ఉదయం ఆయన సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.

Advertisement

Next Story