- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అది నా వ్యక్తిగతం.. పార్టీకి సంబంధం లేదు’
దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ట్వీట్ వివాదంపై దిద్దుబాటు చర్యలు ఆరంభించారు. ట్విట్టర్ మాధ్యమంగా జాతిపిత గాంధీని చంపిన గాడ్సే జయంతి సందర్భంగా… ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. కానీ, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. అంటూ వివాదాస్పద ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది.
నాగబాబుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్‌పై దాడికి తెగబడిన కసబ్ కూడా దేశభక్తుడేనా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవికి చెడ్డపేరు తేవద్దంటూ పీసీసీ హితవు పలికింది. నాగబాబు వ్యాఖ్యలపై కోర్టు ధిక్కారం కేసు కూడా నమోదైంది. బీజేపీతో పొత్తుతో పార్టీ సగం పలుచనైపోయిందని, ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీని మరింత చులకన చేయవద్దంటూ జనసేన పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తన ట్విట్టర్ మాధ్యమంగా మరో ట్వీట్ చేస్తూ.. నేనేమి ట్వీట్ చేసినా, అందులో ఏమున్నా అది పూర్తిగా నా వ్యక్తిగత బాధ్యత అని, జనసేన పార్టీకి కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అంటూ నాగబాబు స్పష్టం చేశారు.