ఫ్లాష్..ఫ్లాష్.. రాష్ట్రపతి ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు

by Anukaran |
ఫ్లాష్..ఫ్లాష్.. రాష్ట్రపతి ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు రాష్ట్రపతి ఎన్నికపై చర్చకు తెరలేపారు. రతన్‌టాటాను రాష్ట్రపతిని చేయాలని ట్విట్ చేశారు. ప్రస్తుతం దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని, ఎత్తుకు పైఎత్తు వేసేవారు కాకుండా దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు.

ఇటీవలే శరద్ పవార్ కూడా రాష్ట్రపతి పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. ఈ వార్తలను శరత్ పవార్ కొట్టిపారేశారు. ఇప్పుడు రతన్ టాటా పేరును నాగబాబు తేరపైకి తీసుకురావడం చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాది జులై 25తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ పదవీకాలం ముగియనుంది.

Advertisement

Next Story