భారతీయుల రక్తం చల్లబడిపోయింది : నాగబాబు

by Jakkula Samataha |
భారతీయుల రక్తం చల్లబడిపోయింది : నాగబాబు
X

గాడ్సే నిజమైన దేశభక్తుడని ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసిన మెగా బ్రదర్ నాగబాబు.. మరోసారి ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. భారతీయుల రక్తం శాంతి, అహింసా మంత్రాలతో చల్లబడిపోయిందన్న ఈ మాజీ జబర్దస్త్ జడ్జి.. తిరిగి రక్తం వేడెక్కాలంటే ఛత్రపతి శివాజీ, రాణాప్రతాప్ సింగ్, అశోక చక్రవర్తి, సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్, శ్రీకృష్ణ దేవరాయలు, రాజ రాజ చోళుడు, సముద్రగుప్తుడు లాంటి మహావీరుల కథలని పిల్లలతో చదివించాలన్నారు. అప్పుడైనా తరువాతి తరం.. సాహసం, పౌరుషం, మరిగే రక్తంతో పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ‘ఎలాగూ మన రక్తం చల్లబడి పోయింది.. వారినైనా దేశానికి ఉపయోగపడే వీరులుగా తయారు చేద్దాం. భారత్‌కు దేశాన్ని ప్రేమించే వీరులు కావాలి.. డబ్బుకు ఓట్లేసే సాధారణ పౌరులు కాదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశద్రోహులు, మాఫియా, ఫ్యాక్షన్, గుండా రాజకీయ నాయకులు, కుహనా ఉదారవాదులు, ఉగ్రవాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక’ అన్నారు నాగబాబు. ప్రతీ నేరాన్ని పోలీస్, మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed