- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడే నిహారిక పెళ్లంట..
దిశ, వెబ్‌డెస్క్: మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా కన్నా.. జబర్దస్త్ జడ్జిగానే తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యాడు. కానీ కొన్ని విభేదాల వల్ల ఆ షో నుంచి తప్పుకున్న నాగబాబు.. జీ తెలుగులో ప్రసారమవుతున్న అదిరింది షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. అప్పడప్పుడు యూట్యాబ్ చానల్ ద్వారా అధికార పార్టీ నాయకులపై సెటైర్లు వేయడంలోనూ ఆయనకు ఆయనే సాటి. కుటుంబ విషయానికొస్తే మాత్రం.. వరుణ్ తేజ్, నిహారికను వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించేందుకు ముందున్నాడు నాగబాబు.
వరుణ్‌ను ఐపీఎస్ ఆఫీసర్‌గా, నిహారికను డాక్టర్‌గా చూడాలనుకున్నప్పటికీ.. చివరకు వారికి నచ్చిన విధంగా సినిమాల్లో రాణించేందుకు సపోర్ట్ ఇచ్చాడు. ఇక పిల్లలకు పెళ్లిళ్లు చేసి తన బాధ్యత తీర్చుకోవాలి అనుకుంటున్నాడట ఈ మెగా బ్రదర్. వచ్చే ఏడాది నిహారికకు పెళ్లి చేసేసి, ఆ తర్వాత 2021 ఎండింగ్‌లో లేదా 2022 ప్రథమార్థంలో వరుణ్‌ను కూడా ఓ ఇంటివాన్ని చేయాలని చూస్తున్నాడట. దీంతో పెళ్లికి ముందే తన కెరియర్‌లో వీలైనన్ని సినిమాలు చేయాలని ఆశిస్తోంది నిహారిక. ఈ మధ్యే తన తమిళ ప్రాజెక్ట్ కూడా ప్రకటించిన నిహారిక.. లాక్‌డౌన్ ఎత్తేయగానే షూటింగ్‌లో పాల్గొననుంది. కాగా సినిమా కెరియర్లో ఒక్క మంచి హిట్ కూడా అందుకోలేని ఈ మెగా డాటర్.. వెబ్ సిరీస్‌లతో మాత్రం దూసుకుపోతోంది.