ప్రభాస్ ఫ్యాన్స్‌కి అప్‌‘డేట్స్’.. నాగ్‌అశ్విన్ ప్రామిస్

by Anukaran |   ( Updated:2021-01-23 05:17:35.0  )
ప్రభాస్ ఫ్యాన్స్‌కి అప్‌‘డేట్స్’.. నాగ్‌అశ్విన్ ప్రామిస్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పాన్ వరల్డ్ లెవల్‌లో రూపుదిద్దుకోనుంది. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ అశ్విన్ ప్రకటించగా.. మూవీ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా.. త్వరలో సినిమాకు సంబంధించిన బిగ్ న్యూస్ రివీల్ చేస్తానంటూ డేట్స్ ఇచ్చేశాడు డైరెక్టర్. ఎగ్జాక్ట్‌గా ఈ నెల 29, వచ్చే నెల 26న సూపర్ ఎగ్జైటింగ్ న్యూస్ అభిమానులతో పంచుకోబోతున్నట్లు తెలిపాడు.

దీంతో ఖుష్ అవుతున్న ఫ్యాన్స్.. సినిమా స్టార్ట్ కాకముందే ఇన్ని అప్‌‘డేట్స్’ ఇవ్వడంపై డైరెక్టర్‌ను పొగిడేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకునే, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటిస్తున్నారని ప్రకటించగా.. ఈ సారి ఏం న్యూస్ చెప్తారోనని ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ అప్‌డేట్ RRR టీమ్‌పై విమర్శల వర్షం కురిపిస్తోంది. షూటింగ్ స్టార్ట్ చేయని నాగ్ అశ్విన్ ఇన్ని అప్‌డేట్స్ ఇస్తుంటే.. ఎప్పుడో ప్రారంభమైన సినిమా గురించి అప్‌డేట్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయిన జక్కన్నను తిట్టిపోస్తున్నారు. నాగ్ అశ్విన్‌ను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story