మరో సినిమా ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్

by Jakkula Samataha |
మరో సినిమా ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్
X

దిశ, సినిమా : మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌజ్ ఫామ్‌లో ఉంది. ‘ఉప్పెన’తో రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాతలు.. ‘సర్కారు వారి పాట’, ‘పుష్ప’, ‘అంటే సుందరానికి’, #PSPK28 నిర్మాణంలో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్‌తో మరో సినిమా ప్రకటించారు. రాజేంద్ర ఈ సినిమా ద్వారా దర్శకులుగా పరిచయం అవుతుండగా.. పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. మార్చి సెకండ్ వీక్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుండగా.. కాస్ట్ అండ్ క్రూ గురించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో వెల్లడించనున్నారు. హీరో కళ్యాణ్ రామ్‌కు ఇది 19వ సినిమా కాగా.. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తున్న 14వ చిత్రం కావడం విశేషం.

https://twitter.com/MythriOfficial/status/1361188002857316352?s=20

Advertisement

Next Story

Most Viewed