- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సల్లూ భాయ్‌తో 'మైత్రీ' మూవీ మేకర్స్
మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్ నిర్మాణ సంస్థ. శ్రీమంతుడు చిత్రంతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన సంస్థ సక్సెస్‌ఫుల్ జర్నీని చూసింది. చాలా కొద్దికాలంలోనే సూపర్ హిట్స్ సాధించి తన హవాను కొనసాగిస్తోంది. తెలుగులో బ్లాక్ బస్టర్స్ రుచి చూసిన మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతోంది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ హీరోగా హిందీలో రంగ ప్రవేశం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సల్లూ భాయ్ బావమరిది అతుల్ అగ్నిహోత్రితో సంప్రదింపులు జరిపారట. ఆయనతో కలిసి సల్మాన్ సినిమాను సంయుక్తంగా నిర్మించేందుకు ఒప్పించాయట. మంచి స్క్రిప్ట్‌తో సల్మాన్‌ను కూడా కలిసి సినిమాకు ఓకే చేయించేందుకు ట్రై చేస్తున్నారట.
ఇక, తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌లో ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వైష్ణవ్‌తేజ్ హీరోగా వస్తున్న చిత్రం ఉప్పెన ఒకటి కాగా, అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది సంస్థ. మామూలుగా అయితే చాలా అనుభవం వచ్చాక కానీ, ఒక సంస్థ మరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు ముందుకు రాదు. కానీ, మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం త్వరలోనే చూస్తాం అన్నమాట.