సైనికుల చేతిలో మయన్మార్‌ దేశం.. అంగ్‌ సాన్ సూకీ అరెస్ట్

by Shamantha N |   ( Updated:2021-02-01 04:10:29.0  )
సైనికుల చేతిలో మయన్మార్‌ దేశం.. అంగ్‌ సాన్ సూకీ అరెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: మయన్మార్ ప్రభుత్వంపై సైనికలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటులో భాగంగా దేశంలో ఏడాది పాటు మిలటరీ ఎమర్జెన్సీ ప్రకటించింది. అనంతరం నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ నేత ఆంగ్‌సాన్ సూకీని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మయన్మార్‌లో ఎన్నికలు జరిగాయి. ఈఎన్నికల్లో మోసపూరితంగా జరిగాయని సైన్యాధికారులు ఆరోపిస్తూ ప్రజా నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత్రి అంగ్ సాన్ సూకీ సహా పలువురు సీనియర్ నేతలను సైనికులు అరెస్ట్ చేశారు. మిలటరీ కుట్రపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యం నెలకొల్పే చర్యలను అడ్డుకుంటే సహించేదిలేదని హెచ్చరించింది. ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలన్న ఆస్ట్రేలియా సైతం మయన్మార్ సైన్యాన్ని డిమాండ్ చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed