నా చావుకు కారణం అత్తమ్మ.. ఓవివాహిత సూసైడ్ నోట్..!

by Sumithra |
నా చావుకు కారణం అత్తమ్మ.. ఓవివాహిత సూసైడ్ నోట్..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘‘నా చావుకి కారణం అత్తమ్మ… బావ నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. అత్తమ్మకి నాకు మధ్యలో నువ్వు నలిగిపోవడం నాకు నచ్చట్లేదు. ఆమెతో నాకు సరిపోయింది. నన్ను క్షమించండి అమ్మ నాన్న. ఐయామ్ సారి రవళి, బావ చెల్లె జాగ్రత్త. మామయ్య ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటు నీ పోట్టి.’’ అంటూ రాసిన సూసైడ్ నోట్ ఓ వివాహిత అత్మహత్యకు పాల్పడ్డ మరుసటిరోజు బయటపడింది. నిజామాబాద్ నగరంలోని దుబ్బలో మంగళవారం అనుమానస్పదంగా చనిపోయిన నాలుగు నెలల గర్భిణికి సంబంధించిన సూసైడ్ నోట్ బుధవారం వెలుగు చూసింది. అందులో తన చావుకు కారణం అత్తమ్మ అన్ని సదరు వివాహిత తన స్వదస్తూరితో రాసిన లేఖ బయటకు వచ్చింది.

అయితే మంగళవారం సదరు వివాహిత ఇంటివద్దనే జారిపడి మృతిచెందిందని అంత్యక్రియలను చేసివేయడం గమనార్హం. కూతురును పోగోట్టుకున్న అ వివాహిత తల్లిదండ్రులు ఫిర్యాదుకు వెనుకడుగు వేయడంతో గుట్టు చప్పుడు కాకుండానే అంత్యక్రియలు జరిగిపేశారు. నగరంలోని దుబ్బకు చెందిన యువతికి, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిథిలోని ఖానాపూర్ కు చెందిన సొంత మేనత్త కొడుకు ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయం ఇంట్లోవారికి చెప్పడంతో కుటుంబీకులు వారికి 2020 జూన్ 16న పెళ్లి చేశారు. అంత సవ్యంగా సాగుతుండగా సదరు వివాహిత నాలుగు నెలల గర్భిణి.

ఇటీవల కాలంలో వివాహిత మామ అనారోగ్యంకు గురికావడంతో కుటుంబంలో కలతలు ఏర్పడ్డాయి. మేనత్త సదరు వివాహితను సూటిపోటి మాటాలతో వేధించడం ప్రారంభించింది. హైదరాబాద్‌కు చికిత్స కోసం మామను తీసుకువెళ్లిన తరువాత కూడా ఫోన్‌లో వేధించడంతో దానిని భరించలేకనే వివాహిత బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాని రెండు కుటుంబాల వారు రక్త సంబంధీకులు కావడంతో వివాహిత అత్మహత్య వెలుగులోకి రాలేదు. పోలీసులు మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని వెల్లడించారు.

Advertisement

Next Story