స్టాక్ విభజనకు సిద్ధమైన ముత్తూట్ ఫైనాన్స్

by Harish |
స్టాక్ విభజనకు సిద్ధమైన ముత్తూట్ ఫైనాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ స్టాక్ విభజనకు సిద్ధమైంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి జులై 18న ముత్తూట్ ఫైనాన్స్ బోర్డ్ వర్గాలు భేటీ అవనున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ షేర్లను స్ప్లిట్ చేసేందుకు , సబ్-డివిజన్‌పై నిర్ణయానికి ఆమోదం తెలిపేందుకు ఈ భేటీని నిర్వహించనున్నారు. ఈ నిర్ణయంపై షేర్ హోల్డర్ల ఆమోదం లభించాల్సి ఉంది. అంతేకాకుండా, బోర్డ్ డైరెక్టర్ల ప్రస్తుత రుణ సేకరణ పరిమితిని రూ. 50,000 కోట్ల నుంచి రూ. 75,000 కోట్లకు పెంచడానికి బోర్డు వాటాదారుల అనుమతి కోరనున్నట్లు ఫైలింగ్ తెలిపింది. స్టాక్ స్ప్లిట్ ప్రక్రియ ద్వారా కంపెనీ తన ప్రస్తుత వాటాలను మరిన్ని వాటాలుగా విభజిస్తుంది. వాటాల సంఖ్య పెరిగినప్పటికీ విభజనకు ముందు ఉన్న మొత్తం విలువ అంతే ఉంటుంది. ఇది స్టాక్ ట్రేడింగ్ ధరను నిర్ణయిస్తుంది. తద్వారా ఎక్కువమంది పెట్టుబడిదారులకు వాటాలను విక్రయించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed