- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షించండి : మైనార్టీ వెల్ఫేర్
దిశ, వెబ్‌డెస్క్: వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షించాలని ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు యాదాద్రి భువనగిరి రామన్నపేట మండల తహసీల్దార్, ఎంపీడీఓ జలందర్ రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని మౌలాలి ఛిల్లా దర్గా పరిధిలో సర్వే నెంబర్ 721లో నాలుగెకరాల 24 గుంటల భూమి తహసీల్దార్ రికార్డుల ప్రకారం.. 1955 నుండి ఇనాం భూమి అని రికార్డుల్లో స్పష్టంగా ఉంది. అయితే.. కొందరు అక్రమార్కులు అధికారులతో కుమ్మక్కై రిజిస్ట్రేషన్లు చేసుకొని పాసు బుక్కులు తీసుకున్నారని తెలిపారు.
దీనిపై వెంటనే విచారించి, ఆ అక్రమ పాస్ బుక్కులను రద్దుచేసి, రికార్డుల ప్రకారం మౌలాలి ఛిల్లా ఇనామ్ భూమిగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సర్వే నెంబర్‌పై ఎలాంటి అనుమతులు, తీర్మానాలు ఇవ్వకూడదని వెంటనే అక్రమ దారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ ఎండి రేహాన్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండి ఆమేర్, ఎండి అక్రమ్, ఎండి పర్వేజ్, ఎండి జావిద్, మిర్జా మజీద్ బెగ్, ఎండి ఆరిఫ్, ఎండి రహీం, మిర్జా ఫజల్ బేగ్, ఎండి జానీ, సయ్యద్ రెహన్, ఎండి కరీం, తదితరులు పాల్గొన్నారు.