- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండ్లల్లోనే ప్రార్థనలు చేయాలని ముస్లిం మతపెద్దల పిలుపు
– లాక్‌డౌన్ నిబంధనల అమలుకు పూర్తి మద్దతు
దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా సహకరించనున్నట్టు, ఇండ్లలోనే ప్రార్థనలు చేయాలని ముస్లిం మత పెద్దలు కోరారు. సోమవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్‌లతో వివిధ అంశాలపై చర్చించారు.
ముస్లిం మత పెద్దలు ఖుబుల్ పాషా సత్తారి, ముప్తీ ఖలీల్ అహ్మద్, మహ్మద్ పాషా, ఇఫ్తెకారి ఫాషా వచ్చి మంత్రులను స్వచ్ఛందంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రంజాన్ మాసం సందర్భంగా సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరాన్ని) పాటించేందుకు తమ ఇండ్ల వద్దనే అన్ని ప్రార్థనలు నిర్వహించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలువనున్నట్లు తెలిపారు. ఈ మహమ్మారి నుంచి బయటపడటమే ముందున్న లక్ష్యమని తెలిపారు.
Tags:Muslim Community Leaders, Prayers, at home, only, covid 19 affect, lockdown