బాలు మృతిపై ఇళయరాజా భావోద్వేగ సందేశం

by Anukaran |
బాలు మృతిపై ఇళయరాజా భావోద్వేగ సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు దశాబ్దాలుగా వివిధ భాషల్లో ఎన్నో హిట్స్ సాంగ్స్, అద్భుత సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ఇళయరాజా తన ప్రాణమిత్రుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయ‌న ఓ వీడియో సందేశం తెలిపారు. ఈ వీడియో ద్వారా త‌న దుఃఖాన్ని వెలిబుచ్చారు. ‘త్వర‌గా లేచిరా.. నిన్ను చూడ‌టానికి నేను వేచి ఉన్నానని చెప్పాను. కానీ నువ్వు వినిపించుకోలేదు. వెళ్లిపోయావు. ఎక్కడికి వెళ్లావు. గంధ‌ర్వలోకంలో పాడ‌టానికి వెళ్లావా.. ఇక్కడ ప్రపంచం శూన్యంగా మారిపోయింది. ప్రపంచంలో నాకేమీ తెలియ‌డం లేదు. మాట్లాడ‌టానికి మాట‌లు రావ‌డం లేదు. చెప్పడానికి ఏమీ లేదు. ఏం చెప్పాలో తెలియ‌డం లేదు. దుఃఖానికి ఓ హ‌ద్దు ఉంటుంది. కానీ నీవ‌ల్ల క‌లిగిన దుఃఖానికి హ‌ద్దే లేదు’ అని ఇళయరాజా అన్నారు.

Advertisement

Next Story