ఇక తెరపై నటుడిగా ఏఆర్ రెహమాన్

by Jakkula Samataha |   ( Updated:2021-03-22 01:48:45.0  )
ఇక తెరపై నటుడిగా ఏఆర్ రెహమాన్
X

దిశ, సినిమా : ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గురించి తెలియని మ్యూజిక్, సినిమా లవర్స్ ఉండరు. తన యూనిక్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను మైమరిపించే ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు యాక్టర్‌గా మారబోతున్నాడు. అది కూడా మాలీవుడ్ సూపర్‌స్టార్ మోహన్ లాల్ మూవీతో కాగా.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఉన్నికృష్ణన్‌ డైరెక్షన్‌లో మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆరట్టు’ సినిమాలో రెహమన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ‘రేర్ అండ్ రిమార్కబుల్ షూట్ విత్ మ్యూజిక్ మ్యాస్ట్రో’ అనే క్యాప్షన్‌తో ఉన్నికృష్ణన్‌, రెహమాన్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ వేదికగా ఫొటో పోస్ట్ చేశారు మోహన్ లాల్. ఈ నేపథ్యంలో రెహమాన్‌ను వెండితెరపై చూసేందుకు వెయిటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యాక్షన్, కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధాశ్రీనాథ్‌ హీరోయిన్‌ కాగా, ఈ ఏడాది నవంబర్‌లో సినిమా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Advertisement

Next Story