- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిక్స్ ప్యాక్‌ను తలపించే ‘మస్క్యులర్ బాడీ సూట్స్’
దిశ, ఫీచర్స్: ఫిట్‌నెస్ ప్రపంచంలో ఆరుపలకల దేహం కోసం ఎంతోమంది కష్టపడుతుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. కరోనా కారణంగా ఏడాది కాలంగా ‘జిమ్ ట్రైనింగ్’ సెంటర్స్ తెరుచుకోలేదు. ఇక ఈ సంవత్సరం కూడా కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘సిక్స్ ప్యాక్’ దేహం పొందడం సాధ్యమేనా? అంటే చైనీయులు అవుననే అంటున్నారు. పతంగి నుంచి ఫైర్‌వర్క్స్ వరకు ఎన్నింటినో ఇన్వెంట్ చేసిన చైనా.. తాజాగా ‘మస్క్యులర్ బాడీ సూట్స్’ను ప్రపంచానికి పరిచయం చేసింది.
‘శౌర్యం’ సినిమాలో ‘జిమ్సన్’ అనే పాత్రలో నటించిన కమెడియన్ అలీ.. ‘సిక్స్ ప్యాక్’లో కనిపించేందుకు ఒళ్లంతా గాలి బుడగలు సెట్ చేసుకోవడాన్ని చూసే ఉంటారు. ఇప్పుడు చైనీస్ కంపెనీ స్మిటిజెన్ తయారు చేసిన సిలికాన్ బాడీ సూట్లు కూడా అలాంటివే. ఇవి ధరిస్తే చాలు.. కండలు తిరిగిన దేహం, సిక్స్ ప్యాక్ కనిపిస్తాయి. కానీ అదంతా సూట్ మాయ. వాస్తవంగా కనిపించే ఈ అల్ట్రా-రియలిస్టిక్ బాడీ సూట్లు టావోబావో, అలీక్స్‌ప్రెస్ వంటి చైనీస్ ఈ -కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఈ సూట్లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇటువంటి బాడీ సూట్స్ రెండేళ్ల క్రితం నుంచే అందుబాటులో ఉన్నా, ఈ మధ్యే వీటికి డిమాండ్ పెరిగింది.
కొన్నేళ్ల క్రితం వరకు ఈ రకమైన బాడీ సూట్స్ సినిమాలు, టీవీ నటులకు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ సగటు వినియోగదారునికి కూడా వాటిని చేరువ చేశాయి. పరిమాణం, నాణ్యతను బట్టి మస్య్కులర్ బాడీ సూట్స్ 790 యువాన్ – 3980 యువాన్ ($ 120 – $ 610) విక్రయిస్తున్నట్లు సమాచారం. కొన్ని సూట్లు కేవలం అప్పర్ బాడీ వరకు వరకు మాత్రమే ఉండగా, మరికొన్ని మాత్రం ఎంటైర్ బాడీని కవర్ చేసేలా రూపొందించారు. ఈ బాడీ సూట్స్ అసంబద్ధమైనవే కావచ్చు కానీ కండరాలు పెంచేందుకు ఇంజెక్ట్ చేసే రకరకాల ప్రొడక్ట్స్, ఇంజెక్షన్స్ కంటే ఇవి ఎంతో బెటర్ అని చెప్పొచ్చు.