- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ సంస్థకు చెందిన రూ. 130 కోట్ల ఆస్తులు సీజ్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు చెందిన ముసద్దిలాల్ జ్యువెల్లరీ సంస్థ ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. ఆ సంస్థకు చెందిన రూ. 130 కోట్ల ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. నోట్ల రద్దు సమయంలో ముసద్దిలాల్ జ్యువెలరీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా మనీ ల్యాండరింగ్ జరిగినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ముసద్దిలాల్‌కు చెందిన ఆస్తులను జప్తు చేసిన అధికారులు మొత్తం వివరాలను రాబడుతున్నారు.
కాగా, 2016లో నవంబర్ 8వ తేదిన పెద్దనోట్లను రద్దు చేస్తూ మోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన తర్వాత చాలా పెద్ద పెద్ద సంస్థలు అప్రమత్తమయ్యాయని ఈడీకీ సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన ముసద్దిలాల్ జ్యువెలరీ సంస్థ బులియన్ మార్కెట్ వ్యాపారులతో కలిసి కోట్లాది రూపాయల నగదు మార్పిడికి స్కెచ్ వేశారని విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో వెంటనే దాడులు నిర్వహించిన అధికారులు కేసు కూపీ లాగుతూ వచ్చారు. ఇక తాజాగా ఆ సంస్థకు చెందిన రూ. 130 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. 2019లో కూడా ముసుద్దిలాల్ సంస్థకు చెందిన బంగారాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు.