దారుణం.. మందు తాగి తమ్ముడిని నరికి చంపిన అన్న

by Sumithra |
దారుణం.. మందు తాగి తమ్ముడిని నరికి చంపిన అన్న
X

దిశ, మరిపెడ: మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలో దారుణం జరిగింది. రేపోని గ్రామంలో మద్యం మత్తులో తమ్ముడిని పొట్టనపెట్టుకున్నాడో అన్న. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇదే గ్రామానికి చెందిన వెంకన్న, గంగయ్యలు అన్నదమ్ములు. గురువారం రాత్రి ఇద్దరు కలిసి మందు తాగారు. అయితే వారి మధ్య చెలరేగిన వివాదం పెద్దదిగా మారింది. దీంతో మద్యం మత్తులో ఉన్న వెంకన్న ఆవేశంతో చేతికందిన గొడ్డలితో గంగయ్య(35)ని నరికాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ హత్యపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story